Mahaa Daily Exclusive

  దొంగతనాలు,సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

Share

*దొంగతనాలు,సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 

*కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన కార్యక్రమం

 

*సబ్ ఇన్స్పెక్టర్ సబ్బాని శివకృష్ణ

 

మట్టెవాడ, మహా;

 

వరంగల్‌ మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ భద్రకాళి దేవాలయం వద్ద మట్వాడ ఎస్సై శివకృష్ణ నేతృత్వంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. పండుగల వేళ దొంగతనాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, పలు అంశాల పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

బతుకమ్మ, దసరా పండుగ సెలవుల సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు.

 

*సైబర్ నేరాలపై అవగాహన*

 

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ పండుగ ఆఫర్లు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రోడ్డు భద్రత లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఎస్సై

శివకృష్ణ ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సిబ్బంది, కానిస్టేబుల్స్ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.