- నిరసనల నేపథ్యంలో
- కేంద్రం కీలక నిర్ణయం
- సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు భద్రత పెంపు…
- ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా
న్యూఢిల్లీ, మహా : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది. ఇప్పటికే ఉన్న జెడ్ ప్లస్ భద్రతకు అదనపు సిబ్బందిని మోహరించింది. జ్ఞానేశ్‌కుమార్ ఢిల్లీలోని నివాసం, కుటుంబ సభ్యుల ఇళ్ల వద్ద నిరసనలు చోటుచేసుకోవడంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’ వద్ద కూడా భద్రతను పెంచారు. కార్యాలయం లోపల సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని పెంచగా.. బయట ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్), సీఆర్‌పీఎఫ్, ఢిల్లీ పోలీసులను మోహరించారు. ఎస్‌ఐఆర్ అంశంపై రోజువారీగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా
ఇదిలా ఉండగా.. జ్ఞానేశ్‌కుమార్ ఈ నెల 7, 8 తేదీల్లో చేపట్టాల్సిన ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా పడింది. ‘అనివార్య కారణాల వల్ల’ పర్యటనను వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వెల్లడించింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.






