Mahaa Daily Exclusive

  బంగారు ఆభరణాల చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్…

Share

*బంగారు ఆభరణాల చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

*మహిళకు మద్యంలో మత్తు పదార్థం కలిపిన నిందితులు

*రూ.1.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం

*మట్వాడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ రావు

మట్టేవాడ, మహా ;

వరంగల్ మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను మాయమాటలతో నమ్మించి, మద్యంలో మత్తు పదార్థం కలిపి తాగించి అపస్మారక స్థితికి చేర్చి, ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాల తో పాటు మొబైల్ ఫోన్‌ ను చోరీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను గురువారం మట్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి సుమారు రూ. 180 000 విలువైన బంగారు ఆభరణాల తో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

*కేసు వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్*

తేదీ 26.09.2026 న ఎంజీఎం ఆసుపత్రి నర్సింగ్ హాస్టల్ సమీపంలోని చెట్ల ప్రాంతానికి బాధితురాలిని నిందితులు మాయమాటలు చెప్పి రప్పించారు. అనంతరం ఆమెకు మద్యంలో మత్తు పదార్థం కలిపి తాగించారు. దీంతో బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకుంది.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న నిందితులు బాధితురాలి వద్ద ఉన్న బంగారు పుస్తెలతాడు, బంగారు ఉంగరం, బంగారు చెవిదిద్దులు , ఓ మొబైల్ ఫోన్‌ను దొంగిలించి అక్కడి నుండి పరారయ్యారు.
ఈ ఘటన పై బాధితురాలి ఫిర్యాదు మేరకు మట్వాడ పోలీస్ స్టేషన్‌ లో క్రైమ్ నెంబర్.537/2026 U/S 123, 318(4), 303(2) r/w 3(5) బి.ఎన్.ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

*దర్యాప్తు, నిందితుల అరెస్ట్*

కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో అందిన సమాచారం మేరకు ములుగు రోడ్ జంక్షన్ వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

*అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు*
ఎ-1 పెండెల కిషన్ ఎ-2 పల్లె సాయి శివ
ఎ-3 గా ఆకరపు శివకుమార్ @ లడ్డు గా పోలీసులు వెల్లడించారు.
నిందితుల నుండి
1.975 గ్రాముల బంగారు ఉంగరం, 2.200 గ్రాముల బంగారు చెవిదిద్దులు, 26.100 గ్రాముల బంగారు పుస్తెలతాడు 2.420 గ్రాముల రెండు పుస్తెల తో పాటు
0.680 గ్రాముల రెండు గుండ్లు
ఒక లావ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని
నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌ కు తరలించారు.

*ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి*

తెలియని వ్యక్తుల మాటలు నమ్మి వారితో ఒంటరిగా వెళ్లడం, వారు అందించే ఆహారం లేదా పానీయాలను స్వీకరించడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు ఏవైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ కోరారు.