- మృతుల కుటుంబాలకు ఆత్మీయ పరామర్శ
- డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
ఆత్మకూరు, మహా;
హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన కి.శే. పొదిల సమ్మక్క ఇటీవల మరణించగా గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన గాఢ సానుభూతిని తెలియజేశారు.
అదే గ్రామానికి చెందిన న్యాయవాది తనుగుల సన్నీ తండ్రి కి.శే తనుగుల సాంబయ్య నిన్న కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఇనగాల వారి ఇంటికి వెళ్లి, సాంబయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు మహేశ్వరి, రేవూరి జైపాల్ రెడ్డి, పలువురు స్థానిక నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.








