Mahaa Daily Exclusive

  వచ్చేది మరో ఎండాకాలమే…

Share

  • వచ్చేది మరో ఎండాకాలమే
  • ముందుంతా మండే కాలమే
  • – రాష్ట్రంలో రానున్న రోజుల వాతావరణంపై ఐఎండీ అలర్ట్

హైదరాబాద్, మహా : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఉక్కపోత వాతావరణం నెలకొని జనం అసౌకర్యానికి గురవుతున్నారు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్​రావు తెలిపారు. అలాగే తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైందన్నారు. ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణ నుంచి నిష్క్రమించిన నైరుతి రుతుపవనాలు, రేపటికల్లా పూర్తిస్థాయిలో తిరోగమనమవుతాయని ఆయన తెలిపారు.