Mahaa Daily Exclusive

  సీకేఎం లెక్చరర్ సతీష్ కుమార్ కు స్థానచలనం…

Share

  • సీకేఎం లెక్చరర్ సతీష్ కుమార్ కు స్థానచలనం
  • ఆరోపణల నేపథ్యంలో డిప్యూటేషన్ భద్రాచలం కు బదిలీ

వరంగల్, మహా;

సికేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జువాలజి లెక్చరర్, ఎన్సిసి కెప్టెన్ సతీష్ కుమార్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల కొంతమంది విద్యార్థినులు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కు ఫిర్యాదు చేశారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందించి ఐదుగురు జిల్లా అధికారులతో కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగరీత్యా సతీష్ కుమార్ భద్రాచలం నుండి డిప్యూటేషన్ పై సికేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చారు. కాగా విచారణలో భాగంగా బుధవారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ ను ప్రస్తుతం వరంగల్ నుంచి భద్రాచలం కు యదా స్థానానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.