- 9న ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు
- కంది శ్రీనివాస రెడ్డిరి కలిసిన నాయకులు కార్మికులు
- కాంగ్రెస్ మద్దతిస్తున్న అభ్యర్ధులను గెలిపించాలని కంది శ్రీనివాస రెడ్డి పిలుపు
- బాణం గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి
ఆదిలాబాద్ : టీఈజీఎస్ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న టీడబ్ల్యూ యూ,ఎస్ డబ్ల్యూ ఎఫ్ ,ఐన్టీయూసీ మిత్రపక్షాల అభ్యర్ధులను గెలిపించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు.ఆర్టీసీ నాయకులు ఆదివారం కంది శ్రీనివాస రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి మద్దతు కోరారు. ఈ నెల 9న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న టీజీఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న మిత్రపక్షాల కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ కార్మికులకు కంది శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేసారు. క్లాస్-III, క్లాస్-VIకు సంబంధించిన రెండు ఓట్లను కూడా బాణం గుర్తుకే వేయాలని కోరారు. ఆర్టీసీకి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని, సంస్థను లాభాల బాట పట్టించేందుకు చర్యలు చేపట్టిందని కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు.ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.అలాగే రేపు నిర్వహించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, మద్దతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్ , నాయకులు దేవిదాస్ చారి ఆర్టీసీ సంఘ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.








