ఆదిలాబాద్ : ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్నవారి కుటుంబాలకు ,అనారోగ్యంతో బాధపడుతున్న వారి చెంతకు వెళ్లి వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి. ఆదివారం ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీలలో పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారు ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలను అలాగే ఆసుపత్రులలో అనారోగ్యంతో బాధ పడుతున్నవారిని కలసి పరామర్శిచారు. వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, శాంతన్ రావు , బండారి సతీష్, బోనగిరి సంటెన్న, తమ్మల చందు, విఠల్ రెడ్డి తదితరులున్నారు.








