ఆదిలాబాద్ : ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన పద్మశాలి సంఘ ఎన్నికలలో గెలిచిన నూతన కార్యవర్గానికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అభినందనలు తెలిపారు.ఆదివారం పట్టణంలోని దస్నాపూర్ లో గల జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షులు జక్కుల సత్యనారాయణ నివాసాన్ని ఆయన సందర్శించారు. కంది శ్రీనివాస రెడ్డి కి ఆయన ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపి దంపతులను శాలువాతో సత్కరించారు. పద్మ శాలి సంఘ అభివృద్దికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారమందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, శాంతన్ రావు , బండారి సతీష్, బోనగిరి సంటెన్న, తమ్మల చందు, విఠల్ రెడ్డి, పద్మశాలి సంఘ నాయకులు మంచికట్ల ఆశమ్మ అల్చెట్టి నాగన్న, కుర్ర రవీందర్, అనుముల ఉషన్న, కొక్కుల అడెల్లు తదితరులు పాల్గొన్నారు.








