కారేపల్లి, మహ: సింగరేణి మండలం మాదారం గ్రామానికి చెందిన మూడ్ లక్ష్మా ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబానికి మాదారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ, మండల కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యాన్ని వితరణ చేశారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి అవసరమైన సమయంలో సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ సాయం చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాదారం గ్రామ శాఖ అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ అజ్మీర రవి, 8వ వార్డు సభ్యుడు పాయం మునేందర్, బర్మావత్ కోటి, బర్మావత్ వీరన్న, బర్మావత్ వంశీ, రవి, లాలు, మోతిలాల్, రమేష్, మురళి, బిక్కు, శ్రీకాంత్, దేవా, భాను తదితరులు పాల్గొన్నారు.








