నల్గొండ: తెలంగాణ మీడియా అకాడమీ (MATG) ఆధ్వర్యంలో, డేటాలీడ్స్, గూగుల్ ఇనిషియేటివ్ సంయుక్త సౌజన్యంతో “కృత్రిమ మేధ (AI) & సోషల్ మీడియా” అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నల్గొండ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించారు.
వర్క్‌షాప్‌లో సీనియర్ జర్నలిస్టులు ముద్దం నరసింహస్వామి, ఉడుముల సుధాకర్ రెడ్డి వక్తలుగా వ్యవహరించి, జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం, సోషల్ మీడియా నిర్వహణ, ఫ్యాక్ట్ చెకింగ్ తదితర అంశాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. ఈ వర్క్‌షాప్‌కు జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై AI టూల్స్, ఆధునిక మీడియా పోకడలపై విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
————-








