Mahaa Daily Exclusive

  పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం…

Share

  • పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం
  • ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
  • రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హనుమకొండ, మహా ;

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన గడిచిన 33 నెలల్లో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
శనివారం 31వ డివిజన్ పరిధిలోని అవంతి స్కూల్ కాలనీ, హంటర్ రోడ్ విశాల్ మార్ట్ ఆవరణ, సూర్యోదయ కాలనీ, శ్రీరామ్ హిల్స్, హంటర్ హిల్స్ రోడ్ నంబర్ 3 ప్రాంతాల్లో సుమారు రూ.2.60 కోట్లతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కాలనీ ప్రజలు, సంబంధిత అధికారులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి డివిజన్ లో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త పనులను కూడా వేగంగా చేపడుతున్నామని తెలిపారు.
నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే నాయిని తెలిపారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ లేకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ బత్తిని శ్రీనివాస్ రావు, డివిజన్ ఇంచార్జ్ మార్క విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు, వేల్పుల మోహన్ రావు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు,