Mahaa Daily Exclusive

  ఎవరే అమ్మ పాట విడుదల… గుండెలను పిండేస్తున్న సాహిత్యం…

Share

ప్రముఖ పాటల రచయిత వెంగళభాస్కర్ రచించిన ఎవరే అమ్మ పాటను హైదరాబాద్ లోని అమ్మన్యూస్ నెట్ వర్క్ కేంద్ర కార్యాలయంలో ఎఎన్ఎన్ సీఈవో కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఎవరే అమ్మ పాటకు సంగీతం అందించిన శ్రీవెంకట్ తో పాటు ప్రముఖ సంగీతదర్శకుడు, గాయకుడు బోలేషావలి, రచయిత వెంగళభాస్కర్, నిర్మాత శ్రీనివాస్, న్యూస్ ఎడిటర్ గడ్డం క్రిష్ణమూర్తి నటీనటులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బోలేషావలి వీడియోసాంగ్ కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రచయిత భాస్కర్, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. ప్రముఖులు పాటలోని సాహిత్యం, చిత్రీకరణ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. గుండెలు పిండేసేలా పాట సాహిత్యం, చిత్రీకరణ ఉందని ప్రశంసించారు.