కారేపల్లి, మహ : కారేపల్లి మండలం సూర్యతండ వార్డు సభ్యుడు అజ్మీర్ లకుపతి తండ్రి అజ్మీర సక్రియ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సక్రియ సంస్మరణ కార్యక్రమాన్ని బుధవారం సూర్యతండాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యతండా సర్పంచ్ బానోత్ రాందాస్ నాయక్, టిఆర్ఎస్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న హాజరై మృతుడు సక్రియ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుని కుమారుడు అజ్మీర లకుపతి ని పరామర్శించి ఓదార్చారు.








