హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక 2026 AKF క్యాడెట్, జూనియర్ & U-21 ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌కు తెలంగాణకు చెందిన నలుగురు కరాటే క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ కరాటే-డూ అసోసియేషన్ అధ్యక్షులు, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు క్రీడాకారులను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సన్మానించి అభినందించారు.
జోర్డాన్‌లోని అమ్మాన్‌లో సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో విషాల్ రెడ్డి అమ్రాడి (-61 కేజీ), సత్య తేజ బ్రహ్మాండాని (+66 కేజీ), నిష్ఠ గంగిసెట్టి (-61 కేజీ), శశాంక్ సాత్విక్ లంకె (-52 కేజీ) తెలంగాణ తరఫున పోటీపడనున్నారు.
ఆసియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి తెలంగాణకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. క్రీడాకారుల తల్లిదండ్రులు, కోచ్‌లను కూడా ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ హెడ్ కోచ్, KIO జాయింట్ సెక్రటరీ కీర్తన్,కరాటే స్టేట్ జనరల్ సెక్రటరీ మల్యాల రామస్వామి, జాయింట్ సెక్రటరీ వెంకటేష్, కోచ్ నరేష్, ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.








