కారేపల్లి, మహ :శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాలు,నివాసాల్లో మహిళలు అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసుకుని అమ్మవారికి ఇష్టమైన పండ్లు,పువ్వులు, పిండి వంటకాలు పెట్టి వరలక్ష్మీ వ్రతాలను సాంప్రదాయ రీతిలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించారు.ఈ సందర్భంగా సింగరేణి మండలంలో గల ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.ఆలయ పూజారులు భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలను అమ్మవారికి అలంకరించి కుంకుమార్చనలు చేశారు. అదేవిధంగా అమ్మవారికి ఒడి బియ్యం పోయడంతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Post Views: 104








