Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో ఆగస్టు 13 నుంచి 15 వరకు 14వ కేబుల్ నెట్ కన్వర్జెన్స్ (CNC EXPO–2026)..

Share

హైదరాబాద్, ఆగస్టు: దేశంలోని కేబుల్ టీవీ, బ్రాడ్‌బ్యాండ్, టెలికాం, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు, తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎంఎస్‌వోలు, ఎల్‌సీవోలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఒకే వేదికపై కలుసుకునే ప్రతిష్టాత్మక 14వ కేబుల్ నెట్ కన్వర్జెన్స్ (CNC EXPO–2026) ఈ నెల 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ఎక్స్‌పోలో బ్రాడ్‌బ్యాండ్, కేబుల్ టీవీ, FTTH, IPTV, OTT, IoT, మొబైల్ టెక్నాలజీ, బ్రాడ్‌కాస్ట్, CCTV కెమెరాలు, సెక్యూరిటీ సొల్యూషన్స్, హోమ్ ఆటోమేషన్, ICT తదితర రంగాలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించనున్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 200కు పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్,350కు పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొని తమ వినూత్న ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించనున్నాయి. అలాగే లైవ్ ప్రొడక్ట్ డెమోలు, నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలు, పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్ష సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

కేబుల్ టీవీ, బ్రాడ్‌బ్యాండ్ రంగాల్లో వేగంగా వస్తున్న సాంకేతిక మార్పులు, వ్యాపార అవకాశాలు, నూతన పరికరాలు, సేవలపై అవగాహన పెంపొందించుకోవడానికి ఈ ఎక్స్‌పో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, డీలర్లు, టెక్నీషియన్లు, వ్యాపారవేత్తలు పాల్గొనే అవకాశం ఉందన్నారు.

కేబుల్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని CNC EXPO–2026ను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

సందర్శకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్స్‌పోలో ప్రవేశించేందుకు ముందస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

వేదిక: HITEX Exhibition Centre, Hyderabad
తేదీలు: 13, 14 & 15 ఆగస్టు – 2026మరిన్ని వివరాలకు:
సి.ఎన్.సి. రాము
📞 95050 50007