Mahaa Daily Exclusive

  శతాధిక వృద్ధురాలి మృతి పట్ల మాజీ ఎంపీ నామ సంతాపం..

Share

  • శతాధిక వృద్ధురాలి మృతి పట్ల మాజీ ఎంపీ నామ సంతాపం
  • భౌతికాయానికి నివాళ్ళు అర్పించిన బిఆర్ఎస్ నాయకురాలు మనీషాలక్ష్మీ

కారేపల్లి, మహ: కారేపల్లి మండల పరిధిలోని చిన్న కట్టుగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు,జిల్లా దిశ కమిటీ మాజీ సభ్యుడు లకావత్ లక్ష్మణ్ నాయనమ్మ లకావత్ అంజి (101) శనివారం తుదిశ్వాస విడిచారు.విషయం తెలుసుకున్న ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు లకావత్ లక్ష్మణ్ ను ఫోన్ లో పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపారు.అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ యువ నాయకురాలు బానోత్ మనీషాలక్ష్మీ చిన్న కట్టుగూడెం గ్రామానికి చేరుకుని అంజి భౌతికాయానికి పూలమాలతో నివాళ్లు అర్పించారు.మనీషా లక్ష్మీ వెంట మాజీ జడ్పీటీసీ జగన్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తాత వెంకన్న,రవీందర్, జర్పుల హచ్చు,జంకిలాల్, బర్మావత్ కోటి,మురళి,మధు తదితరులు పాల్గొన్నారు