ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర డివిజన్ దేవరకొండ బస్తీలో ప్రజా సమస్యలపై సమరంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానికులు మంచి నీటిలో కలుషిత నీరు రావడం, దెబ్బతిన్న రోడ్లు, వెలగని వీధి దీపాలు వంటి అనేక సమస్యలను MGR గారి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల సమస్యలను విన్న వెంటనే స్పందించిన MGR గారు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశిస్తూ నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తాహెర్, ఫయాజ్, రాజు, ఇమ్రాన్, శివ, రాజేష్, ఇర్షత్, తదితరులు పాల్గొన్నారు.








