ఆదిలాబాద్ పట్టణం లోని ప్రజా సేవ భవన్ లో ఆదివారం ప్రజా దర్భార్ నిర్వహించారు.అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యల పై కంది శ్రీనివాస రెడ్డి గారికి వినతి పత్రాలు అందించారు. సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..







