ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర డివిజన్ ఉదయ్ నగర్ లో నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘం BLO శంకర్ , BLA నరేందర్ & షౌరిరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక పరిశీలన ప్రక్రియను పరిశీలించారు.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలని, మరణించినవారి పేర్లు లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను సకాలంలో సరిచేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా ఎన్నికల ప్రక్రియకు పునాది అని పేర్కొంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో అవసరమని MGR గారు తెలిపారు.
అర్హులైన ప్రతి పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైతే కొత్తగా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్, రాధా,షౌరిరాజ్,మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.








