జైనూర్ మహా : కొమురం భీం ఆపిఫాబాద్ జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అధికారులు ఇసుకకోసం అను మతి ఇవ్వడంతో కొందరు ఇందిరమ్మ ఇల్లు. కాకుండానే ప్రైవేట్ లో విక్రయించ డానికి ఇందిరమ్మ ఇండ్ల పేరిట అక్రమ ఇసుక దందా నడుస్తోంది. గతంలో కూడా అసిఫాబాద్ నుండి జైనూర్ వరకు ఇసుక విక్రయ దారులు తమ ట్రాక్టర్లలో ప్రభుత్వానికి పనులు చెల్లించకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమ ఇసుక దందా చేస్తూ పట్టుబడ్డారు. మళ్లీ తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అనుమతులు ఇవ్వాలని అధికారులకు ప్రజా ప్రతినిధులు కోరడంతో ఇదే సందుగా ఇసుక విక్రయదారులు ఇసుకకు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా నేరుగా ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక తరలిస్తూ అక్రమ దండ చేస్తున్నట్లు తెలు స్తోంది. దీంతో అటవీశాఖ రెవెన్యూ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకపో వడంతో ఇసుక విక్రయ దందా దారులు అక్రమంగా ఇసుక తరలిస్తూ దందా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రభుత్వానికి పన్నులు చెలించకుండా ఎగనామం పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అక్రమంగా ఇసుక దందా చేయ కుండా నిబంధనల ప్రకారం గా అధికారులు పర్యవేక్షణ చేసి అక్రమ దందాకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. పర్యవేక్షణసరిగా చేయకపోవడంలో అంతర్యం ఏమిటి గతంలో ఇసుకదారులు అక్రమ దందా చేస్తూ రాత్రివేళ తీసు కొని ట్రాక్టర్ల ద్వారా తరలించేవారు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరట రాత్రి పగలు ఇసుక తరలిస్తూ అక్రమ దందా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడంలో అంతర్యమేంటని విమర్శలు వస్తున్నాయి. ఇసుక దందా దారులు ప్రజా ప్రతినిధులకు అధికారులకు మామూళ్లు మాట్లాడుకుని అక్రమ దందా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రాత్రివేళ కాకుండా పట్టపగలు కట్టల ద్వారా ఇసుకను తరలించడంతో చాలామంది అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ చేసి ఆక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని చాలామంది ప్రజలు కోరుతున్నారు.








