Mahaa Daily Exclusive

  ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు జరపాలి …తెలంగాణ సిపిఐ కంట్రోల్ కమిషన్ రాష్ట్రకార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వా మి..!

Share

బెల్లంపల్లి ,మహా:తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల వార్షికో
త్సవాల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని తెలంగాణ కంట్రోల్ కమిషన్ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు.శనివారం రోజు తెలంగాణ రైతంగా సాయుధ పోరాట యోధుల వార్షికోత్సవాల సందర్భంగా నెంబర్ టు ఇంక్లైన్ రడగంబాల బస్తిలో జరిగిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రసంగిస్తూ తెలంగాణ రైతన్న సాయు
ధ పోరాట యోధులు స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం పురంకితం కావ
లసిన బాధ్యతను కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంఘాలు మరింత థృడ సంక
ల్పంతో పోరాడాలని కోరారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ
తో శాంతి చర్చలు తక్షణమే జరపాల
ని, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా క్రిమినల్ నాన్ ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా బూటకపు ఎదురుకాల్పుల పేరుతో జరుగుతున్న నరమేధాన్ని తక్షణమే ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.ప్రాపంచిక కార్మిక వర్గ దృక్పధం అర్థం చేసుకొని నరేంద్రమోడీ నరాంతక పాలన వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్టులతో హిందూ రాజ్యాన్ని స్థాపించాలని జరు
గుతున్న తెరవెనుక నాటకాలను హిందూ పాసిజర్ ని ఓడించాలంటే దేశంలో ఉన్న అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. మావోయిస్టు పార్టీ కూడా ప్రజాసామిక పోరాటాలకు కలిసి రావలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య,
పట్టణ పార్టీ కార్యదర్శి ఆడెపు రాజ
మౌళి,తెలంగాణ రైతన్న సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు.

Latest