Mahaa Daily Exclusive

  బాలపేటలో గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు షేక్. జానీపాషా.. !

Share

తల్లాడ, సెప్టెంబర్, 1, (మహా )
తల్లాడ మండలంలోని బాలపేట గ్రామంలో శ్రీవిద్య గణేష్ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా ఐదు రోజులు పాటు లంబోదరుడికి గ్రామస్తులందరూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆదివారం రాత్రి మహాగణపతి లడ్డు వేలం పాట నిర్వహించారు. ఈ పాటలో పాల్గొన్న ఆ గ్రామానికి చెందిన ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు షేక్. జానీ పాషా అందరికంటే అధిక ధరకు లడ్డూను 30, 516 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం భక్తుడు లడ్డూను సొంతం చేసుకోవడం పట్ల గ్రామంలో ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ సంఘటన మతసామరస్యానికి ప్రతీకతో పాటు స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయని పలువురు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Latest