రంగారెడ్డి జిల్లా మహా:
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్క్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం. చంద్ర మోహన్, గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు మాట్లాడుతూ… గ్రామపంచాయతీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 3116 పైబడి పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. గత 2 నెలలు నుండి పెండింగ్ లో వేతనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులచే పని చేయించుకుంటుంది తప్ప వేతనాలు చెల్లించడంలో విఫలమైందని మండిపడ్డారు. కార్మికులు చాలీచాలని వేతనాలతో గ్రామాల్లో పారిశుద్ధ్య, డ్రైనేజీలు క్లీనింగ్ గ్రామాల్లో అనేక సేవలు చేస్తున్నారు. పండుగ పూట పస్తులున్నటువంటి కార్మికులకు, రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు వేసే దాంట్లో విఫలమైంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాల్లో అనేక సేవలు చేస్తున్నారని కితాబ్ ఇచ్చారు. కానీ వాళ్లకు కావాల్సిన వసతులు కల్పించడంలో వెనకడుగు వేశారని దుయ్యబట్టారు. పరిస్థితి కార్బన్లకు పారిశుద్ధ కార్మికులకు రావలసిన పెండింగ్ వేతనాలు, జీవో నెంబర్ 51ని సవరించి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చందు, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.








