Mahaa Daily Exclusive

  రేష‌న్ డీల‌ర్ల నిర‌స‌న‌..!

Share

ఆదిలాబాద్ మ‌హా: రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ కోరారు.రేషన్ డీలర్ల సంక్షేమం కోసం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టిన‌ట్టు తెలిపారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఉన్న పెండింగ్ కమిషన్ లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు తమ మేనిఫెస్టోలో ప్రకటించిన‌ట్టుగా రేషన్ డీలర్లకు 5వేల రూపాయ‌ల గౌరవ వేతనం ఇవ్వాల‌ని కోరారు. ప్ర‌క్క రాష్ట్రం ఏపీ ప్ర‌భుత్వం ఇస్తున్న‌ట్టు తెలంగాణలో కూడా సరుకుల దిగుమతి హమాలిని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేపారు. ప్రభుత్వం కమిషన్ ను డిస్టిక్ ట్రెజరీ ఆఫీస్ నుండి కాకుండా డీలర్ల అకౌంట్లో నేరుగా కమిషన్ను విడుదల చేయాలని కోరారు.తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న‌ట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటేష్,కోశాధికారి హరీంద్ర రేషన్ డీలర్లు.ఇచ్చోడ రాజేశ్వర్,ఆదిలాబాద్ రూరల్ వినోద్ చౌదరి,శ్రీనివాస్ గుడి హత్నూర్ , బేల రాజేష్,నేరడిగొండ లింగ రెడ్డి,బోథ్ దేవీదాస్,ఉట్నూర్ దుర్గా ప్రసాద్ తది తర జిల్లా లోని అన్ని మండలాల నుండి రేషన్ డీలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Latest