Mahaa Daily Exclusive

  ఖమ్మం పశు వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ హరీశ్ ఏకగ్రీవం…!

Share

ఖమ్మం సిటీ, మహా.
ఖమ్మం జిల్లా పశు వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ అనంతుల హరీశ్ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికలు బుధవారం ఖమ్మం నగరంలోని జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించబడ్డాయి.

సంఘం కొత్త కమిటీలో డాక్టర్ మానుకొండ రాకేశ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, డాక్టర్ రఘుపతి కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులుగా పశు వైద్యులు ఉషశ్రీ, శశిదీప్, జానీ, కృష్ణారెడ్డి, సృజన ఎన్నికయ్యారు.

ఎన్నికల అధికారిగా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.ప్రదీప్ వ్యవహరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పశు వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.రమేశ్ బాబు, మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఉపేంద్ర ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో అశోక్, సుబ్బారావు, రాంజీ, బోనస్, సమీరా, స్వాతి, లత సహా ఇతర మండలాల పశువైద్యులు పాల్గొన్నారు.

Latest