Mahaa Daily Exclusive

  పలు దేవాలయాలలో వరలక్ష్మీ వ్రతం — అమ్మ వారి దేవాలయాలలో మహిళా భక్తుల సందడి ..!

Share

మందమర్రి, మహా : మందమర్రి పట్టణం కే.కే.-1 సి.ఎస్.పి, శ్రీ. శ్రీ శ్రీ దుర్గా భవాని దేవాలయం, దొరగారి మామిడి తోటలోని శ్రీ అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయాలలో వరలక్ష్మీ వ్రతం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా దేవాలయాలకు మహిళలు కొత్త బట్టలు ధరించి పూజా సామాగ్రి, పిల్లాపాపలతో సతీ సమేతంగా సందడి చేశారు. ప్రతి సంవత్సరం శ్రావణం మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేయడం ఆనవాయితీగా వస్తుంది. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరని పెద్దలు అంటుంటారు. అంతేకాదు, సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు నర్సింగ్ భవాని, సతీష్ భవాని ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ దేవాలయాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Latest