Mahaa Daily Exclusive

  పేదలకు అండగా నిలిచిన సనాతన హిందూ సేవా సమితి విజయవంతంగా 81 సేవా కార్యక్రమాలు పూర్తి ..!

Share

రంగల్ మహా;

దారిద్రరేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు, ఎవరు లేని అభాగ్యులకు అండగా మేం ఉన్నామంటూ హిందూ ధర్మాన్ని అనుసరించి సనాతన హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో 81 సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. బుధవారం 81వ సేవా కార్యక్రమాల్లో భాగంగా భర్త చనిపోయి ఆరోగ్య సమస్యల తో పాటు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కొండాపూర్ గ్రామానికి చెందిన దూల్మెట రాణి.. గర్నేపల్లి మణెమ్మ అనే ఈ రెండు నిరుపేద కుటుంబాలకు రెండు నెలలకు సరిపడా సన్న బియ్యం తో పాటు నిత్యావసర వస్తువులను అందించి వారిని ఆదుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రూప్ వ్యస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, గ్రూప్ సభ్యులు నోముల మహేష్ బాబు, మాలోత్ రవి, పాల్తీయా రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Latest