Mahaa Daily Exclusive

  డ్రగ్స్ ని నిర్మూలించడం లో విద్యార్థులు ముందుండాలి – సిఐ రామ్ నరసింహారెడ్డి..!

Share

ధర్మపురి, మహా

మంగళవారం జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు వెల్గటూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఎండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశలలో అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంనరసింహరెడ్డి హాజరయ్యారు. ఇందులో భాగంగా సీఐ మాట్లాడుతూ..విద్యార్థులకు డ్రగ్స్,గంజాయి,మత్తు పదార్థాలు సేవించడం వలన జరిగే అనర్థాల గురించి వివరించడం జరిగిందని మాట్లాడారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ ఇంచార్జి సబ్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీధర్ రెడ్డి, ట్రైని సబ్ ఇన్స్పెక్టర్ సతీష్, పోలీస్ సిబ్బంది, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్,ఉపాధ్యాయ బృందం,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Latest