Mahaa Daily Exclusive

  రప్పారప్పా దేనికి? తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ఫుల్ ఫైర్..!

Share

హైదరాబాద్, మహా
రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు… ఇదంతా దేనికోసం అని గులాబీ పార్టీ నేతలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిలదీశారు. మాజీమంత్రులు హరీష్ రావు , జగదీశ్వర్ రెడ్డి అభిమానులు కూడా రప్పా రప్పా అనే డైలాగులు ఫ్లెక్సీ ల పై ఏర్పాటుచేసి… 3.0 లోడింగ్ అంటూ నేతల పర్యటనల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ఏపథ్యంలో పొంగులేటి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. శాంతి భద్రతలతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని… ఏం చేయాలనుకుంటున్నారు..? సినిమా డైలాగులు వాడుకొని రెచ్చిపోతున్నారు…? అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి శాంతి భద్రతల విషయంలో చిత్తశుద్ధి ఉందని.. గుర్తు చేశారు. సినిమా డైలాగులు చెప్పుకొని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే.. ప్రజలే వాళ్లకు బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు.

Latest