వరంగల్ మహా;
వరంగల్ నగరంలోని ప్రముఖ ప్రాచీన ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో
తేది: 26-06-2025 గురువారం నుండి 15 రోజుల పాటు నిర్వహించే శాకంభరీ నవరాత్ర మహోత్సవ ఏర్పాట్ల పై చర్చా సమావేశం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బి శివసుబ్రహ్మణ్యం (చైర్మన్) అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి (ధర్మకర్తల మండలి) కంచి కామాక్షి, అమ్మవారి రథాన్ని పోలిన రథాన్ని శ్రీ భద్రకాళీ అమ్మవారికి ఒక కోటి రూపాయలతో తయారు చేయించడానికి ఈ సమావేశంలో తీర్మానించారు. అమ్మవారి ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణం పూర్తవుతున్నందున ఇకపై అమ్మవారికి జరిపే వాహన సేవలు, రథ సేవ ఇత్యాదులు మాడవీధుల గుండానే జరుపుతారు. ఇప్పటి వరకు ఆలయానికి మాడవీధులు లేనందున ప్రదిక్షిణ ప్రాకారంలోనే ఈ సేవలు నిర్వహించబడుతున్నాయి. ఇకపై అన్ని సేవలు మాడవీధుల గుండానే నిర్వహించ బడుతాయి. ఈ దశలో భాగంగానే వాహన సేవలు జరుపడానికి అలాగే రథోత్సవం జరుపడానికి పెద్ద రథం కంచి కామాక్షమ్మ రథాన్ని పోలిన రథాన్ని జగము శాస్త్రం ప్రకారం రథం చేయడానికి చర్చించగా దాదాపు కోటి రూపాయలు ఈ రథానికి ఖర్చవుతుందని శ్రీవర్దితాదారు మయమైన (టేకు చెక్కతో) రథం తయారు చేయించడానికి ధర్మకర్తల మండలి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్మాణానికి కావలసిన ప్రభుత్వ అనుమతులు ఆలయ కార్యనిర్వాహక వర్గానికి జారీ చేయించడానికి తెలంగాణా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ ను, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని ధర్మకర్తల మండలి కోరింది. ప్రతి నిత్యం పూజాకాల సమయం నందు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మహాపూజానంతరం ఉచిత ప్రసాద వితరణ జరుపడానికి ధర్మకర్తల మండలి తీర్మానించింది. అమ్మవారి ప్రసాద వితరణ కోసం ఒక శాశ్వత నిధిని బ్యాంకులో ఏర్పాటు చేయడానికి ఉదారముగా విరాళాలు అందించవలసిందిగా ధర్మకర్తల మండలి భక్తులను కోరారు. అంతేకాకుండా 26-06-2025 నుండి 10-07-2025 వరకు శాకంభరీ నవరాత్ర మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటకు ఏర్పాట్ల గూర్చి చర్చించారు.
ఈ సమావేశంలో ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరిరామేశ్వర్రావు, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగు అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్ రావు, ఎక్స్ ఆఫీషియో మెంబర్గా పార్నంది నర్సింహమూర్తి, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, సిబ్బంది, పాల్గొన్నారు.








