Mahaa Daily Exclusive

  మండలంలోని రైతులకు రైతు భరోసా అందించాలి జిల్లాలోని 10 మండలాల్లో రాణి రైతు భరోసా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
జిల్లాలోని 10 మండలాలకు రైతు భరోసా నిధులు రైతులకు అందకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాకపోవడంతో నిరాశ చెందుతున్నారని సిపిఎం నాయకులు సామెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రైతులకు రైతు భరోసా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సిహెచ్ బుగ్గరాములు ఆధ్వర్యంలో పాషా, నరహరి స్మారక కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామేలు మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం మండలంలోని రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలో రైతులకు రైతు భరోసాను నిలిపివేయడం సరైనది కాదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలోని 10 మండలాలకు రైతు భరోసా నిలిపివేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న మండలాలలోని రైతులు ఆకుకూరలు, కూరగాయలు పండించి చాలా అభివృద్ధి అయ్యారనే సాకుతో రైతు భరోసా నిలిపివేయడం సిగ్గుచేటు అన్నారు. భూమిని సాగు చేసుకోని జీవిస్తున్న ప్రజలకు ఆసరా కావలసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలపై వివక్షత చూపడం సరికాదన్నారు. దాదాపు ఇబ్రహీంపట్నం మండలంలో 20వేల మంది రైతులకు రైతు భరోసా నిలిపివేశారన్నారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి ఇబ్రహీంపట్నం మండలంలోని రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, ఈనెల 23న ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జంగయ్య, జగన్, మండల నాయకులు గణేష్, రమేష్, ముసలయ్య, ప్రభాకర్, శ్రీకాంత్, వంశీ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Latest