Mahaa Daily Exclusive

  మన ప్రాచీన జ్ఞాన సాంప్రదాయానికి నిదర్శనం యోగ వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..!

Share

వరంగల్ మహా;

మన ప్రాచీన జ్ఞాన సాంప్రదాయానికి నిదర్శనం యోగ అని,
చారిత్రాత్మక ప్రదేశంలో యోగా చేయడం మన సాంస్కృతి గొప్పతనాన్ని
గుర్తు చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్, పురావస్తు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ కోటలోని కీర్తి తోరణాల మధ్య దాదాపు 1000 మందితో నిర్వహించిన యోగ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, పద్మశ్రీ అవార్డు గ్రహీత సోమ్లా నాయక్ తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ
ఈ సంవత్సరం 11 అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగ ఫర్ వన్ ఎర్త్ – వన్ హెల్త్ అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని అన్నారు.
యోగ విశిష్టత దాని ప్రాముఖ్యత దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కలెక్టర్ వివరించారు.
ఆధ్యాత్మిక అనుభూతికి ప్రతి ఒక్కరు యోగాను జీవనశైలిలో అలవర్చుకోవాలన్నారు. మన ప్రాచీన జ్ఞాన సాంప్రదాయానికి యోగ నిదర్శనమని, ఆరోగ్యానికి జీవ ఔషధమని కలెక్టర్ తెలిపారు. తనువు మనస్సు ఆత్మను ఏకం చేసే సాధనమే యోగా అన్నారు. యోగా అనేది ఒక సంపూర్ణ జీవన విధానం అని మన ఆరోగ్యానికి, శ్రేయస్సుకు చాలా అవసరమైనదని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాకు ఉదయం కొంత సమయాన్ని కేటాయించాలని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులతో కలిసి యోగా ఆసనాలు చేశారు.
ఈ కార్యక్రమంలో
కార్పొరేటర్లు భోగి సువర్ణ సురేష్, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, పోశాల పద్మ , అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆయుష్ డిప్యూటీ డైరెక్టర్ అనసూయ, జిల్లా పరిషత్ సీఈవో రామిరెడ్డి,ఆయుష్ జిల్లా ఇంచార్జ్ మైదం రాజు, డిపిఆర్ఓ అయూబ్ అలీ, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, సిపిఓ గోవిందరాజన్, డి బి సి డి వో పుష్పలత, తాసిల్దార్ లు నాగేశ్వరరావు, ఫణి కుమార్ , యోగా గురువు అమృతవల్లి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజేందర్, పురావస్తు శాఖ అధికారి కృష్ణారెడ్డి, ప్రజలు, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.

Latest