Mahaa Daily Exclusive

  రైతులకు బేడీల ఘటన సర్కార్ సీరియస్..!

Share

మహబూబ్ నగర్, మహా : ధన్వాడ రైతులకు సంకెళ్ళు వేసిన ఘటనపై సర్కార్ సీరియస్ అయింది. రైతులకు సంకెళ్ళు వేసి కోర్టుకు తీసుకు వెళ్లడంపై ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులను బుధవారం పోలీసులు సంకెళ్లతో మహబూబ్‌నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకు వెళ్లారు. ఈ ఘటనపై రాజకీయ విమర్శలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి రాజోలి సబ్-ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్‌తో సహా ఇద్దరు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్‌లపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. రైతులకు బేడీలు వేయడం అమానవీయ చర్యగా, రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ప్రభుత్వం భావించింది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ తొట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Latest