Mahaa Daily Exclusive

  మెట్రో ఫేజ్ 2 డీపీఆర్ అందింది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రిని కలిసిన కిషన్ రెడ్డి..!

Share

న్యూడిల్లీ, మహా : తెలంగాణలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బుధవారం మనోహర్ లాల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితి గురించి ఇరువురు చర్చించారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు సంబంధించి ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. మెట్రో ఫేజ్ -2 కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన డీపీఆర్ ఇటీవలే తమకు అందిందని ఖట్టర్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ డీపీఆర్ ను మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని ఖట్టర్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మెరుగైన కనెక్టివిటితో ఆధునిక హైదరాబాద్ నగర అభివృద్ధి, తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు ఖట్టర్ పేర్కొన్నారు.

Latest