మహా: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ అధికారులు మరోసారి దూకుడు పెంచారు. ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న కీలక వ్యక్తి అయిన ప్రభాకర్ రావు భారత్‌కి తిరిగి వచ్చి విచారణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో విచారణను స్పీడ్ అప్ చేసిన అధికారులు.. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన వారిని వరుసగా విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇస్తుంది. ఇందులో భాగంగా.. ప్రణీత్‌రావును విచారించేందుకు సిట్ సిద్ధం అయింది. ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసి మూసీలో పారేసినట్టు ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఎవరి ఆదేశాలతో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారనే అంశంపై సిట్ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్డ్ డిస్క్‌ల ధ్వంసం వెనుక ప్రభాకర్ రావు ఉన్నట్లు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. దీంతో ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉంది.








