Mahaa Daily Exclusive

  ‘కాళేశ్వరం’ వల్లే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన.ప్రపంచంలో అతి పెద్ద ఇంజనీరింగ్ బ్లండర్ కాళేశ్వరం బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!

Share

మహా: కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వరి దాన్యం దిగుబడి పెరగలేదని, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై గొప్పలు చెప్పుకుని.. ఇప్పుడు తప్పించుకుంటున్నారు అని మండిపడ్డారు. కాళేశ్వరం మంచి అయినా, చెడు అయిన బాధ్యుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఇంజనీరింగ్ బ్లండర్ కాళేశ్వరం అని, కాళేశ్వరంలో అవినీతి జరిగినా ప్రాజెక్ట్ కూడా మిగలలేదు అని ఎద్దేవా చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కాళేశ్వరం కూడా ఓ కారణం అని కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
అందుకే పార్టీ మారిన..
‘కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వరి ధాన్యం దిగుబడి పెరగలేదు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ అన్ని విధాలుగా తప్పు. మేడిగడ్డను బ్యారేజ్‌గా కాకుండా.. డ్యాంగా వాడుకోవడం వల్లనే దెబ్బతింది. అప్పుడు కాళేశ్వరంపై గొప్పలు చెప్పుకుని.. ఇప్పుడు కేసీఆర్ తప్పించుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్వయం ప్రత్యక్షం అయిందా?. గవర్నర్ కేసీఆర్ గారిని కాళేశ్వర్ రావు అని పిలిచారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రైతు ప్రతి ఏడాది 91 వేలు రూపాయలు లబ్ధి పొందుతున్నారు. బీజేపీ ఎంపీలు వేస్ట్ అని ఆరోపిస్తున్నారు. తెలంగాణను ఆదుకుంటుంది కేంద్రం. నవోదయ స్కూల్స్, టూరిజం నిధులు, పీఎం శ్రీ, పీఎం కుసుమ్ పథకం కింద మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే.. తెలంగాణకు ఎక్కువ నిధులు వచ్చాయి’ అని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ‘కాళేశ్వరం మంచి అయినా, చెడు అయిన బాధ్యుడు కేసీఆర్. ప్రపంచంలో అతి పెద్ద ఇంజనీరింగ్ బ్లండర్ కాళేశ్వరం. కాళేశ్వరంలో అవినీతి జరిగినా.. కనీసం ప్రాజెక్ట్ కూడా మిగలలేదు. మిగతా ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినా.. ప్రాజెక్ట్ మాత్రం మిగిలింది. కేబినెట్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కేబినెట్. కమిషన్ అడిగిన దానికి ఈటల రాజేందర్ సమాధానం చెప్పారు. కేసీఆర్ గురుంచి అడిగి ఉంటే ఈటల చెప్పే వారు. నేను బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కాళేశ్వరం కూడా ఓ కారణం’ అని ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు

Latest