Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే పల్లాకు కేసీఆర్ పరామర్శ ..!

Share

మహా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రమాదం జరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ప్రమాదవశాత్తూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జారిపడ్డారు. జారీపడటంతో పల్లా తుంటి ఎముకలో గాయమైంది. దీంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ని కలవడనికి బీఆర్ఎస్ కీలక నేతలు, కుటుంబ సభ్యులు గులాబీ బాస్ ఫాంహౌస్‌కి వెళ్లారు. ఈ క్రమంలోనే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జారి పడినట్లు తెలుస్తోంది.
కేసీఆర్​ పరామర్శ..
జస్టిస్​ పీసీ ఘోష్ కమిషన్​ విచారణ అనంతరం మాజీ సీఎం కేసీఆర్​ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డిని పరామర్శించారు. బీఆర్​కే భవన్​ నుంచి నేరుగా యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన పల్లాను పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు

Latest