Mahaa Daily Exclusive

  ఇందిరమ్మ ఇళ్ల క్యాప్చర్ పై అవగాహన..!

Share

ఆదిలాబాద్, మహా
జిల్లాలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బేస్ మెట్ పూర్తయిన తర్వాత ఇళ్లను క్యాప్చర్ చేసి ఆన్ లైన్లో పొందుపరిచే విధానంపై అధికారులు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ ధరి పంచాయతీలో తొలి విడత ఇళ్లు నిర్మాణాలు కొనసాగుతుండగా.. బేస్ మెట్ లెవల్ పూర్తయింది. వీటిని ఎలా క్యాప్చర్ చేశారో..రెండో విడతలో
మంజూరైన వాటిని కూడా అలాగే చేయాలని స్వయంగా పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ బసవేశ్వర్, రూరల్ ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి, ఏఈ బాచీ, ఏఈఈ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Latest