రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
గురునానక్ విద్య సంస్థలలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం 2025 (వరల్డ్ బ్లడ్ డోనర్ డే) సందర్బంగా మెగా రక్త దాన శిభిరం నిర్వహించడం జరిగింది.
రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ విద్య సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం 2025 సందర్భంగా మెగా రక్త దాన శిబిరాన్ని, స్కూల్ ఆఫ్ ఫార్మసీ మరియు గురు నానక్ హోమియోపతి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) తో కలిసి ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని గురు నానక్ యూనివర్సిటీ రెక్టర్ డా. కలైరాసన్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభిస్తూ ఆయన యువతను మానవతా సేవలో ముందుండాలని ప్రోత్సహిస్తూ, రక్తదానం ప్రాధాన్యతను వివరించారు. స్కూల్ ఆఫ్ ఫార్మసీ అసోసియేట్ డైరెక్టర్ డా. రషీద్ హరూన్ మరియు గురు నానక్ హోమియోపతి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ ప్రిన్సిపాల్ డా. రేణుక బి.వై. కార్యక్రమంలో పాల్గొన్న రక్త దాతలు, అతిధులు, స్వచ్ఛంద సేవకులు, ఎన్ఎస్ఎస్ బృంద సభ్యులకు తమ కృతజ్ఞతలు తెలిపారు. గురు నానక్ విద్య సంస్థల వైస్ చైర్మన్ మరియు గురు నానక్ యూనివర్సిటీ చాన్సలర్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వారి సందేశంలో “రక్తదానం స్వార్థరహిత సేవకు ప్రతీక అని, మానవ సేవలో విద్యార్థులు మరియు సిబ్బంది చూపిన చొరవ పట్ల నాకు గర్వంగా ఉందని చెప్పారు. గురు నానక్ విద్య సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మరియు గురు నానక్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా. హెచ్.ఎస్. సైనీ మాట్లాడుతూ… ఉన్నతమైన ఆశయం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్వచ్చంద పాల్గొన్న విద్యార్థులను మరియు సిబ్బందిని అయన అభినందిస్తూ రెడ్ క్రాస్ సొసైటీ వారికీ కృతజ్ఞతలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో డా. శ్రీనాథ్ రెడ్డి (డైరెక్టర్ జీ ఎన్ ఐ టి సి), డా. సంజీవ్ శ్రీవాస్తవ (డైరెక్టర్ జి యెన్ ఐ టి ), డా. పి. పార్థసారధి (జాయింట్ డైరెక్టర్), మరియు డా. కె. వెంకట రావు (ప్రిన్సిపాల్) హాజరై, నిర్వాహక బృందాన్ని మరియు రక్తదాతలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా విద్యార్థులు మరియు సిబ్బంది రక్తదానం చేసి, సమాజ సేవ పట్ల తమ నిబద్ధతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి రక్తదాతకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రపంచ రక్త దాతల దినోత్సవం రోజున రక్తదాన మరియు అభినందన సర్టిఫికేట్లు ఇవ్వబడతాయని రెడ్ క్రాస్ నిర్వాహకులు తెలియ చేసారు.








