రంగారెడ్డి జిల్లా మహా:
ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మైత్రి అనారోగ్యం కారణంగా ఇంటి వద్ద ఆత్మహత్య పాల్గొనడం పోలీసులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం, ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళపల్లి పటేల్ గూడ గ్రామానికి చెందిన గడుసు వెంకటేష్ చిన్న కుమార్తె మైత్రి (20), గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గత రెండు రోజులుగా కాలేజీకి వెళ్లకుండా కడుపు నొప్పి చెవి నొప్పి రావడంతో ఇంటి దగ్గరే ఉండి, చికిత్స పొందుతున్న మైత్రి కోలుకుంటుందని కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళ పనుల మీద బయటికి వెళ్లడం జరిగింది. బుధవారం కడుపునొప్పి మరింత తీవ్రం కావడంతో భరించలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన సాయి కిరణ్ కు, మైత్రి కనిపించకపోవడంతో, ఫోన్ చేసిన స్పందించకపోవడంతో, గది లోపల నుంచి గడి పెట్టిన సంగతి గమనించిన అతను తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఉరికొయ్యకు వేలాడుతున్న మైత్రిని, పలువురు సహాయంతో 108 అంబులెన్స్ లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా, డ్యూటీ డాక్టర్ గమనించి మైత్రి మృతి చెందినట్లు ప్రకటించారని ఎస్సై బాలరాజు వివరాలను వెల్లడించారు. మృతురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.








