Mahaa Daily Exclusive

  ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్ ..!

Share

వరంగల్ మహా;

ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
నర్సంపేట డివిజన్ పరిధిలో ఆయిల్ ఫాం సాగు చేసిన రైతుల కాపుదశకు వచ్చిన వాటి నుండి సేకరించిన గెలలను రైతులు విక్రయించడం కొరకు ఆయిల్పాం కంపెనీ తరఫున కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట డివిజన్లో ప్రారంభించు కోవడం జరిగిందని, ఇప్పటివరకు సాగు చేసినటువంటి ఆయిల్ ఫామ్ యొక్క సాగు 6000 ఎకరాల వరకు ఉందని, ఇంకా రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. మార్కెట్ సమస్య, దళారుల సమస్య, కోతుల సమస్య, ధరల సమస్య లేనటువంటి పంట ఆయిల్ పామ్ దీనికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పెద్ద రైతులు ఎత్తున సాగు చేయాలని కోరారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ
ప్రతి ఏడాది స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా రైతులు ప్రత్నామయ పంటలపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్ ఫామ్ పండించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందిన రైతులను ఆదర్శంగా తీసుకొని రైతులు ముందుకు వచ్చి ఆయిల్ ఫామ్ సాగు చేయాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్,
రామ్ చరణ్, ఆయిల్ ఇండస్ట్రీస్ జిఎం నారాయణ, డిహెచ్ఎస్ వో జి అనసూయ, ఉద్యాన అధికారులు జ్యోతి తిరుపతి రాకేష్ మరియు రైతులు పాల్గొన్నారు.
అనంతరం
గెలలు కొనుగోలు చేసిన అనంతరం రైతుకు చెక్కు రూపంలో ప్రభుత్వ నిర్ణయించిన ధర ప్రకారం డబ్బులు చెల్లించడం జరిగింది.

Latest