భూపాలపల్లి, మహా :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2024 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ శిక్షణా అధికారుల బృందం సౌరభ్ శర్మ, శ్రీమతి సలోని ఛబ్బ్రా, హర్ష చౌదరి, శ్రీమతి కెరోలిన్ చింగ్తియనమావి, కోయ్యాడ ప్రణయ్ కుమార్, బుధవారం రేగొండ మండలంలోని పాండవుల గుట్టలను సందర్శించి గుట్టలలోని కుంతి గుహలు, భీముని గుండు, ప్రాచీన కాలం నాటి రాతి పెంటింగ్స్ తిలకించారు. అనంతరం కెటికె ఓపెన్ కాస్ట్ 2ను సందర్శించి బ్లాస్టింగ్, ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తిని పరిశీలించి అక్కడి నుండి కేటికె 5 ఇంక్లైన్ ఉపరితల బొగ్గు గని లోపలికి దిగి బొగ్గు తీయు విధానాన్ని పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం వెళ్ళిపోయారు
ఈ పర్యటనలో పర్యావరణ పరిరక్షణ, పురావస్తు ప్రాముఖ్యత, పర్యాటక అభివృద్ధి అవకాశాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా అధికారులు పాండవులగుట్ట చరిత్రను తెలుసుకున్నారు.
శిక్షణలో భాగంగా మన జిల్లాలో నేడు, రేపు రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
తెలంగాణ దర్శన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సందర్శించనున్నారు.
పాండవుల గుట్ట,
సింగరేణి బొగ్గు గనులు (ఓపెన్ కాస్ట్ మరియు అండర్‌గ్రౌండ్), శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. డా. కందుకూరి ఉషారాణి, కోర్సు డైరెక్టర్ మరియు వి. శ్రీనివాస్, నోడల్ అధికారులు శిక్షణ అధికారుల పర్యటనలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రేగొండ తహసీల్దార్ శ్వేతా పాల్గొన్నారు.








