రంగారెడ్డి జిల్లా మహా:
ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కోరుతూ, బుధవారం ఆమనగల్లు మున్సిపాలిటీ కమిషనర్ కు, గంగ భవాని కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. గతంలో ఈ స్థలంను దివంగత మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, ఏఐసీసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చల్ల వంశీ చంద్ రెడ్డి భూమి పూజ చేయడం జరిగింది. కొంత మంది భూ బకాసురులు ఒక ముఠాగా ఏర్పడి, ఆ స్థలంను అన్యక్రాంతం చేయాలని చూస్తున్నారు. ఆ స్థలం కబ్జా బారిన పడకుండా చూడాలని పట్టణ ప్రజలు, కాలనీ వాసులు కోరుతున్నారు. కార్యక్రమంలో బాలకృష్ణ, వెంకటయ్య, బాబా, ప్రశాంత్, సైదులు, నరేష్, రమేష్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
Post Views: 92








