హన్మకొండ మహా;
పీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు.
బుధవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
విజ్ఞాన కేంద్రం నిర్మాణ పనుల గురించి పర్యాటక శాఖ డిఈఈ ధన్ రాజ్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెయింటింగ్, ప్లంబింగ్, డోర్స్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఏఈ జీవన్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post Views: 43








