Mahaa Daily Exclusive

  ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి మావోయిస్టు లతో శాంతి చర్చలు జరపాలి సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి..!

Share

వరంగల్ మహా;

సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ జిల్లా కార్యాలయం తమ్మెర భవన్ లో జరిగిన వామపక్ష పార్టీలు ప్రజాసంఘాల సమావేశానికి న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షత అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో వేర్పాటు వాదులతో, ఉగ్రవాదులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకున్న దాఖలాలు అనేకం ఉన్నాయని, కానీ నేటి మోడీ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపకుండా మావోయిస్టులను వచ్చే మార్చి కల్లా అంతం చేస్తామని ప్రకటించడం సమంజసం కాదని హింసకు హింస పరిష్కారం ఎన్నటికీ కరెక్ట్ కాదని అన్నారు.
మావోయిస్టులు ఆదివాసీలు తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారని అడవుల్లోని ఖనిజ నిక్షేపాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మావోయిస్టు లు, ఆదివాసీలు అడ్డుగా ఉన్నారనే కారణం తోనే ఈ ఆపరేషన్ కగార్ అని అన్నారు, అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి మావోయిస్టు లతో మేధావుల సమక్షంలో శాంతి చర్చలు జరిపి దేశంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని మోడీ ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
మావోయిస్టుల పేరుతో చంపుకుంటూ పోవడం వల్ల సమస్యను ఎప్పటికీ పరిష్కరించలేరని, దీనికి చర్చలే మంచి పరిష్కార మార్గమని తెలుసుకోవాలని గత అనుభవాలు కూడా మనకు తెలియపరుస్తున్నాయని అన్నారు. లేనిపక్షంలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఐక్యంగా ప్రజలందరినీ ఐక్యం చేసి తగిన విధంగా గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈనెల 14 వ తేదీన ఆపరేషన్ కగార్ ను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 10 గంటలకు ప్రదర్శన ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పనాస ప్రసాద్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వలదాసు దుర్గయ్య, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి,సిపిఐ( ఏం ఎల్ )న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గంగుల దయాకర్, ఎం సి పి ఐ (యు) నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, భారత్ బచావో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం వెంగల్ రెడ్డి,తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు జనగాం కుమారస్వామి,ఏ ఐ డి ఎస్ ఓ నాయకులు కె సురేష్, పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి బి.ఎస్ పాని,ఆర్ ఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లందాసు కుమార్, అరుణోదయ నాయకులు బుల్లెట్ వెంకన్న,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సండ్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest