వరంగల్ మహా;
వరంగల్ మహా నగర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ గోవిందరాజస్వామి దేవాలయంలో జేష్ట మాసం గిరి పూర్ణిమ ను పురస్కరించుకొని గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులు, అనువంశిక అర్చకులు, పాలకమండలి, ముదిరాజ్ నాయకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి పల్లకిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీ గోవిందరాజ స్వామి అనుగ్రహాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ పెద్దలు చింతాకుల సునీల్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీసాల ప్రకాష్ , జారితి శ్రీనివాస్ , పర్స శ్రీను, గోవిందాద్రి సేవాదళ్ సభ్యులు, అడీక రంజిత్ ,యాట ప్రతాప్, సాయి ,అరుణ్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 47








