Mahaa Daily Exclusive

  చోరీ లపై ప్రత్యేక ఫోకస్ పెట్టండి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌..!

Share

హన్మకొండ మహా;

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీల నియంత్రణ పై ప్రతి పోలీస్ అధికారి ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ కమిషనర్‌ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని పోలీస్ కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించారు. వరంగల్‌ కమిషనరేట్‌ చెందిన పోలీస్‌ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ముందుగా ఆస్తి నేరాల పై సమీక్ష జరిపారు. ఇందులో ప్రధానంగా పెండింగ్ చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్, సోమ్ము రికవరీ, పెండింగ్ లో వున్న చోరీ కేసులు, నిందితుల అరెస్ట్ పై సీపీ సమీక్ష జరపడం తో పాటు, సుధీర్ఘ కాలంగా పెండింగ్‌ లో ఉన్న ఇతర కేసులపై సమీక్ష జరిపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకోని, కేసుల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నేరాల నియంత్రణ కై సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలను భాగస్వాములను చేయడం వల్ల సిసి కెమెరాల ప్రాధాన్యత పై ప్రజలకు అవగాహన కల్పించాలని, నేరాలకు సంబంధించి అధికారులు దర్యాప్తు సమయం లో టెక్నాలజీ తో పాటు శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టాలని, చోరీల పై పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యంగా వాహనాల చోరీలకు సంబంధించి వాహనాలను ఇంటి లోపల పార్కింగ్ చేసుకోనే విధంగా ప్రజలకు సూచించాలని సీపీ తెలిపారు. అలాగే రాబోవు బక్రీద్ పండుగను దృష్టి లో పెట్టుకొని మూగజీవాల రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు, పండుగ వేళ దర్గాల వద్ద పతిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని వరంగల్ కు వున్న కీర్తి ప్రతిష్టలకు తగ్గట్లుగా పోలీసింగ్ ఉండాలని సూచించారు. ప్రతి పోలీస్ బేసిక్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా,రాజమహేంద్రనాయక్‌, అంకిత్‌కుమార్‌, జనగాం ఏఎస్పీ చైతన్య, అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు పాల్గోన్నారు.

Latest