వరంగల్ మహా;
పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుకు సహకరించాలని ఏంఎన్ఆర్ఈ జాయింట్ సెక్రటరీ జేవిఎన్ సుబ్రమణ్యం అన్నారు.
మంగళవారం దేశ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన 65 నగరాల కలెక్టర్లు, కమిషనర్ లతో ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (పి ఎం ఎస్ జీ ఏం బి వై) అమలు రాష్ట్రాల వారి పని తీరు పై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో నగరం నుండి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే వర్చువల్ గా పాల్గొన్నారు.
ఈ సందర్భం గా ఏంఎన్ఆర్ఈ జాయింట్ సెక్రటరీ పథకం అమలును వేగవంతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌ల ద్వారా ఒక కోటి గృహాలు సొంత విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేలా సాధికారత కల్పించడం లక్ష్యం గా నిర్ణయించడం జరిగిందని, అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల ఏం డి లు, జిల్లా ల కలెక్టర్లు కమిషనర్ లు సంపూర్ణ సహకారం అందించాలని, ఈ పథకాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళి విజయవంతం చేయడంలో అధికారులు సమన్వయం తో పనిచేయాలని, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల మధ్య ఆన్-గ్రౌండ్ అమలును మరింత బలోపేతం చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ ఈ మహేందర్, ఐ టి మేనేజర్ రమేష్, తదితరులు, పాల్గొన్నారు.








